టీడీపీ అవిశ్వాస తీర్మానం గొప్ప విషయమేమీ కాదు: టీఆర్ఎస్

  • అవిశ్వాసంపై చర్చలో పాల్గొంటామన్న ఎంపీ వినోద్
  • ఓటింగ్ పెడితే అందులో పాల్గొనాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం
  • హైకోర్టు విభజన జరగకపోవడానికి టీడీపీనే కారణం
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి.. టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మద్దతు ప్రకటించలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గొప్ప విషయమేమీ కాదని చెప్పారు. అవిశ్వాసంపై ఓటింగ్ పెడితే... అందులో పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవిశ్వాసంపై జరిగే చర్చలో మాత్రం పాల్గొంటామని... విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీనే అని విమర్శించారు. 
Go Back to Shorts
Telugudesam
TRS
no confidence motion

More Telugu News